ఏపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ… వ్యవసాయంలో వరి సాగుచేయడం వల్ల లాభం లేదన్నారు. ప్రభుత్వం ఎన్ని చేసినా వరి రైతుల కష్టం తీరడం లేదన్నారు. అవకాశముంటే రొయ్యిల చెరువుల సాగు చెయ్యటం మంచిదన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. గతంలో మత్స్యకారప్రాంతాలను అభివృద్ది చేయకుండా తప్పుచేసామని తాను ఒప్పుకుంటానన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్ హార్బర్ మంజూరు చేసారు.. తలసరి ఆదాయం పెరగటానికి, మన తలరాత మార్చడానికి ఆక్వారంగంలోని అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. కాలువలు, రోడ్ల అభివృద్దికి వచ్చే రెండేళ్లలో ముందుకు వెళతామన్నారు. సంక్షేమం వలన ఇబ్బంది ఉందని, మాట ఇచ్చాం కనుక పెద్ద ఎత్తున నిధులు అవసరమన్నారు. కష్టమైనా సంక్షేమం కొనసాగిస్తున్నామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital