తిరుమల , ప్రభన్యూస్ : తిరుమల నడకమార్గాల్లో దివ్యదర్శనం టోకెన్ల జారీని టీటీడీ శనివారం ఉదయం పున: ప్రారంభించింది. కోవిడ్ నేపథ్యంలో గత మూడు సంవత్సరాలుగా దివ్యదర్శనం టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేసింది. అయితే భక్తుల కోరిక మేరకు అలిపిరి నడకమార్గంలో గాలిగోపురం వద్ద 10 వేలు, శ్రీవారిమెట్టు మార్గంలో 1250వ మెట్టు వద్ద 5 వేల దివ్యదర్శనం టోకెన్లను శనివారం నుంచి కేటాయిసోంది. టీటీడీ. భక్తులు నేరుగా తమ ఆధార్ కార్డుతో హాజరైతేనే టోకెన్లు జారీ చేస్తారు. టీటీడీ కొద్దిరోజుల పాటు ప్రయోగాత్మకంగా దివ్యదర్శనం టోకెన్ల జారీని పరిశీలించనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టోకెన్లు పొందాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
- Advertisement -