ఉరవకొండ రూరల్, ( ప్రభ న్యూస్ ) : అనంతపురం జిల్లాలో హంద్రీనీవా సుజల స్రవంతిలోని ప్రధాన కాలువకు ఇరువైపుల సాగు చేసిన మిర్చి, వేరుశనగ పంటలకు నీరు లేక పోవడంతో, పంటలు ఎండిపోతున్నాయని,ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని చిన్న ముష్టూరు గ్రామం వద్ద ఉన్న హంద్రీనీవా కాలువ సమీపంలో ఉన్న అనంతపురం – ఉరవకొండ రహదారిలో బైఠాయించి, రైతన్నలు రాస్తారోకో నిర్వహించారు. హంద్రీనీవా కాలువకు ఒక్కసారిగా నీటి సరఫరా నిలిపివేశారు. ఒక ఎకరా పంట సాగు చేయడానికి 25 వేల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టామన్నారు. నీటి సరఫరా నిలిపి వేయడంతో వేలాది ఎకరాల్లో సాగు చేసిన పంటలు దెబ్బ తినే పరిస్థితి ఏర్పడిందన్నారు. హంద్రీనీవా కాలువకు నీటిని మళ్లించి కపోతే ఆత్మహత్యలే శరణ్యం న్నారు. అధికారులు స్పందించి హెచ్ఎల్ సి కాలువ ద్వారా హంద్రీనీవా కాలువకు నీటిని మళ్లించి, పంటలను కాపాడాలన్నారు. దాదాపు రెండు గంటలపాటు రాస్తారోకో నిర్వహించడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది. అధికారులు వచ్చి హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించే ప్రసక్తి లేదని రోడ్డుపై భీష్మించి కూర్చున్నారు. అనంతరం తాసిల్దార్ ముని వేలు మాట్లాడుతూ విషయం జిల్లా ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement