Tuesday, November 26, 2024

AP: ఎట్ట‌కేల‌కు ఏబీకి పోస్టింగ్… ఈరోజే ప‌ద‌వీ విర‌మ‌ణ

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పోరాటం ఎట్టకేల‌కు ఫలించింది. తాజాగా ఆయనకు పోస్టింగ్ ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఆయనను నియమిస్తూ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీచేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ ఉదయం ఆయనపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం ఆ తర్వాత కాసేపటికే పోస్టింగ్ ఇచ్చింది.

గతంలోనూ ఆయనకు అదే పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం తాజాగా మళ్లీ అదే పోస్టులో నియమించడం గమనార్హం. కాసేపట్లో చార్జ్ తీసుకోనున్న ఆయన సాయంత్రం పదవీ విరమణ చేయనున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏబీవీపై సస్పెన్షన్ వేటు పడింది. రక్షణ వ్యవహారాల పరికాల కొనుగోలులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. దీనిపై ఆయన క్యాట్‌ను ఆశ్రయించగా సస్పెన్షన్‌ను సమర్థించింది.

- Advertisement -

ఆ తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టును కూడా ఆయన ఆశ్రయించారు. చివరికి ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను క్యాట్ ఎత్తివేసింది. తాజాగా, సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏబీవీని విధుల్లోకి తీసుకున్న ప్రభుత్వం.. ఆ వెంటనే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement