Monday, November 25, 2024

ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ‘వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక’ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వం 2.66 లక్షల మంది వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ చేపట్టింది. సోమవారం నుంచి వలంటీర్లు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలో 60.80 లక్షల మందికి పెన్షన్లు ఉండగా.. వారికోసం రూ.1420.48 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది.

లబ్ధిదారుల గుర్తింపు కోసం బయోమెట్రిక్, ఐరిస్‌ విధానాలను అమలు చేస్తున్నారు. అలాగే.. ఆర్‌బీఐఎస్‌ విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎవరైనా తమ సొంత నివాసం నుండి ఇతర ప్రాంతాలకు వైద్యం లేదా ఇతర కారణాలతో ఆరు నెలలు ఊరెళ్లిన వారికి కూడా, వారు ఉండే చోటే పెన్షన్‌ అందించే ఏర్పాట్లుచేసినట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.. పెన్షన్‌ పంపిణీని మూడ్రోజుల్లో నూరుశాతం పూర్తయ్యేలా వలంటీర్లను ఆదేశించామన్నారు.

ఇది కూడా చదవండి: హుస్నాబాద్‌లో బండి సంజయ్ పాదయాత్ర ముగింపు!

Advertisement

తాజా వార్తలు

Advertisement