Friday, November 22, 2024

త్వ‌ర‌లోనే అమ‌రావ‌తిలో ఇళ్ల‌ప‌ట్టాల పంపిణీ.. స‌జ్జ‌ల

అమ‌రావ‌తిలో లబ్ధిదారులకు ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం త్వరలోనే ప్రారంభం అవుతుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అమరావతిలోని R5 జోన్ లో ఇళ్ల స్థలాల కేటాయింపు జీఓ 45పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని దాఖలైన 2 అనుబంధ పిటిషన్లు ఏపీ హైకోర్ట్ కొట్టివేసింది. ఈ తీర్పుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఇది ఒక విజయం అని అనుకోవటం లేదు.. అడ్డంకులు సృష్టించే ప్రయత్నాన్ని కోర్టు అడ్డుకుంది.. అన్యాయమైన డిమాండ్ ను కోర్టు డిస్మిస్ చేసిందన్నారు.

రాజకీయ దురుద్దేశాలతో అడ్డుకునే ప్రయత్నం చేశారు… రాజధాని అంటే ప్రజలు అందరూ ఉండే ప్రాంతం.. డిమొగ్రాఫిక్ ఇన్ బ్యాలెన్స్ అనే అన్యాయమైన వాదనను తీసుకుని వచ్చారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పటికే భూమి చదును వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం చట్టం ప్రకారం 5 శాతం భూమిని పేదలకు కేటాయించాలనే నిబంధనను పట్టించుకోలేదు. మూడు ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా ఇక్కడ కూడా తగిన విధంగా అభివృద్ధి జరుగుతుందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. హైకోర్ట్ తీర్పు నేపథ్యంలో అధికారులు ఇళ్ళ పట్టాల పంపిణీకి అంతా సిద్ధం చేస్తుండడంతో లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement