Thursday, November 21, 2024

AP : ఇద్ద‌రు ఎమ్మెల్సీల‌పై అన‌ర్హ‌త వేటు…

ఎన్నికల వేళ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వరుసగా వేటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వైసీపీ, టీడీపీ పార్టీలకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై ఇటీవల అసెంబ్లీ స్పీకర్ వేటు వేశారు. తాజాగా ఇద్దరు రెబల్ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. వైసీపీ రెబల్ ఎమ్మెల్సీలు పి. రామచంద్రయ్య, వంశీకృష్ణయాదవ్‌పై శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు అనర్హత వేటు వేశారు. ఈ మేరకు మంగళవారం చైర్మన్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, పార్టీ ఫిరాయించిన రెబల్ ఎమ్మెల్సీలు పి.రామచంద్రయ్య, వంశీకృష్ణయాదవ్‌పై చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్ మోషేన్ రాజుకు వైసీపీ ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. వైసీపీ ఫిర్యాదు మేరకు చైర్మన్ విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని పలుమార్లు నోటీసులు జారీ చేశారు. నోటీసులకు రెబల్ ఎమ్మెల్సీలు స్పందించకపోవడంతో మండలి చైర్మన్ వారిపై వేటు వేశారు. కాగా, పార్టీ తీరు, అంతర్గత విభేదాలతో ఎమ్మెల్సీలు పి.రామచంద్రయ్య, వంశీకృష్ణయాదవ్‌ వైసీపీని వీడారు. ఎమ్మెల్సీ పి.రామచంద్రయ్య టీడీపీలో చేరగా.. వంశీకృష్ణ పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement