పోస్టల్ బ్యాలెట్ నిబంధనలపై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. రేపు (జూన్ 1) సాయంత్రం 6 గంటలకు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి ఏపీ సీఈవో ఇచ్చిన మెమోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. పోస్టల్ బ్యాలెట్ ఓటుకు ముద్ర లేకపోయినా చెల్లుబాటు అవుతుందని ఈసీ చెప్పడంతో… దానిని సవాల్ చేస్తూ వైసీపీ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement