Friday, November 22, 2024

చంద్రబాబు ఆస్తులపై వేసిన పిటిషన్ కొట్టివేత

తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్తులపై విచారణ జరపాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ వ్యాజ్యాన్ని లక్ష్మీపార్వతి దాఖలు చేశారు. విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ.. ఒకరి ఆస్తులు తెలుసుకోవడానికి మీరెవరని లక్ష్మీపార్వతిని ప్రశ్నించింది. ‘‘హైకోర్టు అన్నివిధాలా ఆలోచించే పిటిషన్‌ను కొట్టివేసింది. ఎవరి ఆస్తులు.. ఎవరికి తెలియాలి? మీరు లేవనెత్తిన అంశానికి విలువ లేదు’’ అని పేర్కొంటూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్‌ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement