ఈవీఎం స్ట్రాంగ్ రూంలోకి స్నేహితుడిని
తీసుకెళ్లిన ఘటనపై ఎన్నికల సంఘం సీరియస్
సీసీ ఫుటేజ్ చూసి విధుల నుంచి తొలగింపు
తిరుపతి జిల్లాలోని చంద్రగిరి డీఎస్పీ శరత్ రాజ్ కుమార్ పై వేటు పడింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు ఉన్నతాధికారులు. తన స్నేహితుడైన హోమియోపతి డాక్టర్ ను బుధవారం స్ట్రాంగ్ రూమ్ లోకి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన దృశ్యాలు…. సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను చూసి ఈసీ సీరియస్ అయింది.
జిల్లా అధికారులు డీజీపీకి నివేదిక పంపడంతో డీఎస్పీ పై పడింది వేటు. ఈనెల 13వ తేదీ పోలింగ్ సందర్భంగా కూచువారిపల్లె, రామిరెడ్డి పల్లిలో అల్లర్లు అదుపు చేయడంలోనూ విఫలమయ్యారు. సిట్ నివేదికతో మరికొంత మంది అధికారులపై వేటు పడే అవకాశముంది. ఇప్పటికైతే చంద్రగిరి డీఎస్పీ శరత్ రాజ్ కుమార్ పై వేటు పడింది.