అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో 13 మంది పోక్సో చట్టం స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లకు ప్రభుత్వం ఉద్వాసన పలికింది. వివిధ జిల్లాలో పనిచేస్తున్న పోక్సో చట్టం స్పెషల్ కోర్టుల్లో పెండింగ్ కేసులు లేనందున, ప్రభుత్వ ఖజానాకు భారంగా పరిగణించి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ని తొలగించమని డైరెక్టర్ అఫ్ ప్రాసిక్యూషన్స్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ వారిని తొలిగిస్తు ఆదేశాలు జారీచేశారు.
జిల్లా వారిగా తొలిగించిన వారిలో….
లోలుగు వెంకట రమణ మూర్తి – శ్రీకాకుళం జిల్లా,
మావూరి శంకర్ రావు- విజయనగరం,
పితాని శ్రీనివాస రావు – కాకినాడ,
కే. కృష్ణ – విశాఖపట్నం,
ఎం వెంకటేశ్వర్లు -భీమవరం,
ముంజులూరు వెంకట మహేష్ కుమార్ – మచిలీపట్టణం,
చినుకా సురేష్ చంద్ర యాదవ్ – తెనాలి,
కే శ్యామల – గుంటూరు,
యనమల వెంకటేశ్వర్లు – ఒంగోలు,
డి శైలజ రెడ్డి – నెల్లూరు,
వి. వెంకటేశ్వర రెడ్డి – కర్నూల్,
ఎస్ .రామ సుబ్బారెడ్డి – కడప,
వి. శైలజ – చిత్తూర్ తదితరులు ఉన్నారు.