Friday, November 22, 2024

Disha Instal – పరవాడ పోలీసుల ఓవరాక్షన్ – సైనికుడిపై జులుం

:పరవాడలో ప్రజా స్వామ్యానికి తల వంపులు తెచ్చేలా పోలీసులు ప్రవర్తించారు. ఏకంగా మహిళా కానిస్టేబుల్‌తో సహా నలుగురు పోలీసులు ఆర్మీ ఉద్యోగిపై దండయాత్ర చేశారు. గంటకు పైగా వందలాది మంది చూస్తుండగా సైనికొద్యోగికి పరవాడ పోలీసులు చుక్కలు చూపించారు. మంగళవారం పరవాడ సంతలో ఈ చోటుచేసుకున్న ఈ ఘటన పెను సంచలనం సృష్టించింది… పరవాడ పోలీసులు మంగళవారపు సంతలో దిశ సబ్‌ స్రిృప్షన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. అయితే మహిళల రక్షణకు నిద్దేశించిన ఈ యాప్‌ను స్త్రీపురష భేదం లేకుండా అందరి ఫోన్‌లోకి చొప్పించేందుకు మహిళా కానిస్టేబుల్‌ చేసిన ప్రయత్నం ఘర్షణ కు కారణమైంది.

సయ్యద్ అలీముల్లా దువ్వాడలో సెక్టార్ 10లో నివశిస్తూ జమ్మూ కాశ్మీర్ లో 52 రాష్ట్రీయ రైఫిల్ క్యాంప్ సోల్జర్ గా పనిచేస్తున్నాడు. సెలవు పై వచ్చిన ఆయన సొంతూరు ఎలమంచిలి మండలం రేగుపాలెం వెళ్లేందుకు పరవాడ సంతబయల బస్ స్టాప్ లో వేచి ఉన్నాడు. ఆయన వద్దకెళ్లిన మహిళా కానిస్టేబుల్‌ ఫోన్‌ తీసుకుని దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసింది. అంతవరకూ బాగానే ఉంది. అయితే ఫోన్‌కొచ్చిన ఓన్‌ టైం పాసువర్డ్‌ చెప్పాలని కానిస్టేబుల్‌ పట్టుబట్టడంతో ససేమీరా అన్నాడు. పాస్‌వర్డ్‌ను తానే ఎంటర్‌ చేస్తాననడంతో పాటు నేమ్ ప్లేట్ లేనందున గుర్తింపు కార్డు చూపితే ఒటిపి చెబుతాననడంతో చిర్రెత్తుకొచ్చిన మహిళా కానిస్టేబుల్‌ అతడి పై చేయిచేసుకుంది. ప్రభుత్వం స్త్రీపురష బేధం లేకుండా అందరితో దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించమని తమను ఆదేశించిందని చెప్పింది. (ప్రభుత్వ అర్డర్‌ ఉంది కాబట్టే తాము చేస్తున్నాం). దీంతో నిర్ఘంతపోయిన సైనికుడు దేశ సరిహద్దు కాశ్మీర్లో పనిచేసే తనకు దిశా యాప్ ఎందుకని ఎదురు తిరిగి ప్రశ్నించాడు. స్థానికులు ఆయనకు సపోర్ట్‌ చేయడంతో పక్కనే ఉన్న మరో కానిస్టేబుల్‌ స్టేషన్ కి ఫోన్ చేశాడు. నలుగురు సిబ్బంది హుటాహుటిన స్టేషన్‌ నుంచి అక్కడకు అటోలో చేరుకున్నారు. జరిగిన విషయాన్ని కనుక్కోకుండానే అమాంతం నలుగురు మీదపడి దాడి చేశారు.

బలవంతంగా ఆటోలోకి నెట్టే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో స్వల్ప గాయాలైన సైనికుడు తన ప్రాథమిక హక్కులకు భంగం కల్గిస్తూ పోలీసుల దౌర్జన్యాన్ని వీడియో తీయాలని స్థానికులకు విజ్ఞప్తి చేశాడు. తన ఫోన్‌ నెంబర్‌ చెప్పి తనకు పంపాలని కోరాడు. అయితే వీడియో తీసేందుకు యత్నించిన వారిని సయితం పోలీసులు బెదిరించి గంటకు పైగా పరవాడ సంతలో యుద్ద వాతావరణాన్ని సృష్టించారు.

పోలీసుల పెనుగులాటలో పక్కనే ఉన్న బడ్డీలో రిప్రిజిరేటర్‌, కూల్‌డ్రిరక్స్‌కు నష్టం వాటిల్లింది. దీనిపై విశాఖ రేంజ్‌ డిఐజి, అనకాపల్లి జిల్లా ఎస్‌పి తగు దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. పరవాడ సంత కావడంతో అక్కడకు చేరుకున్న వందలాది మంది పోలీసుల చర్యను తీవ్రంగా దుయ్యబట్టారు. దిశ యాప్‌ను బలవంతంగా పోన్‌లోకి డౌన్‌లోడ్‌ చేయడాన్ని వ్యతిరేకించారు. ఏది ఏమైనా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు సైనికునిపై అకారణంగా దాడి చేయడాన్ని పోలీసు అధికారులు ఎలా సమర్దించుకుంటారో వేచి చూడాల్సిందే!.

Advertisement

తాజా వార్తలు

Advertisement