ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో ఉపాధ్యాయ సంఘాల చర్చలు ముగిశాయి. గంటన్నరకుపైగా సాగిన ఈ సమావేశంలో ముఖ ఆధారిత యాప్‌పై ఉపాధ్యాయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సొంత ఫోన్లను వాడటం తమకు సాధ్యం కాదని ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. సొంత ఫోన్లు వాడాల్సిందేనని మంత్రి తేల్చి చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఈ యాప్ త్వరలో అమల్లోకి వస్తుందని బొత్స చెప్పారు. దీంతో ఉపాధ్యాయ సంఘాలు పదిహేను రోజుల తర్వాత మళ్లీ భేటీ కావాలని నిర్ణయించుకున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement