Thursday, November 28, 2024

AP | ప్రతిభకు వైకల్యం అడ్డుకాదు.. కలెక్టర్ డా.లక్ష్మిశ

(ఆంధ్రప్రభ, విజయవాడ) : వైకల్యమనేది మనిషికే కానీ మనస్సుకు కాదని, విభిన్న ప్రతిభావంతుల ప్రతిభ ముందు వైకల్యం చిన్నబోతుందని, క్రీడల్లో రాణించడం ద్వారా విభిన్న ప్రతిభావంతులు సకలాంగులకు ధీటుగా సత్తాను చాటాలని జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మిశ అన్నారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా విభిన్న ప్రతిభావంతుల వయోవృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన క్రీడా పోటీలలను జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మిశ ప్రారంభించి క్రీడాకారులను ఉత్సహపరిచారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… వైకల్యమనేది మనిషికే కానీ మనస్సుకు కాదన్నారు. సహజంగా సకలాంగులకంటే విభిన్న ప్రతిభావంతుల్లో మానసిక స్థితి ఎంతో దృడంగా ఉంటుందన్నారు. విభిన్న ప్రతిభావంతులకు అవసరమైన తోడ్పాటును అందిస్తే ఎటువంటి విజయాలనైనా సాధించగలుగుతారన్నారు. ప్రతిభావంతుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడంతో పాటు మానసిక స్థైర్యాన్ని నింపేందుకు ఇటువంటి క్రీడా పోటీలు ఎంతో దోహదపడతాయన్నారు. వైకల్యాన్ని గురించి ఆలోచించక క్రీడాలలో రాణించడం ద్వారా విభిన్న ప్రతిభావంతుడు ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలని కలెక్టర్ కోరారు.

పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరు విజేయతగా భావించాలన్నారు. సమాజంలో అన్ని రంగాలలో రాణించేలా విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. సకలాంగులతో సమానంగా విభిన్న ప్రతిభా వంతులు జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేలా ప్రతి ఒక్కరు సహకరించేల ముందుకు రావాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందిపుచ్చుకుని రాణించడం ద్వారా మనోధైర్యాన్ని పెంచుకోవాలన్నారు. జిల్లా స్థాయి క్రీడా పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర అంతర్జాతీయ స్థాయిలోనూ విజేతలుగా నిలిచేలా అధికారులు విభిన్నప్రతిభావంతులను ప్రోత్సహించాలని డా.జి. లక్ష్మీశ తెలిపారు.

- Advertisement -

విభిన్న ప్రతిభావంతుల క్రీడలలో విజేతలు వీరే…
విభిన్నప్రతిభావంతులకు నిర్వహించిన వివిధ పోటీలలో విజయమేరి స్కుల్ నుండి అంధుల విభాగంలో బిందు శ్రీ, స్టువర్ట్, యశ్వంత్, మధుశ్రీ, అపర్ణ , భవ్యశ్రీ, సంజయ్ ప్రభుత్వ విభిన్న ప్రతిభావంతుల బాలుర వసతి గృహమునాకు చెందిన ప్రదీప్, శివకుమార్, శ్రీనివాన్, ప్రమోద్ కుమార్ మానసిక వకలాంగుల విభాగంలో ఉయ్యూరులోని శిరిష , రిహరిలిటీషన్ సెంటర్ కు చెందిన గిరిష, సాయి మురళి, శివ ప్రసాద్, మహేష్, విజయ్ బదిరిల విభాగంలో మదిన స్కూల్ కు చెందిన నిహరిక, వైష్ణవి, యాకోబు, ఫణి కుమార్ మడోన కాలెజ్ నుండి హరిష రేష్మ, నాగ సుధ, హేమంత్, చందు, గోపిచంద్, మురరి లు విజయం సాధించారు. కార్యక్రమంలో విభిన్నప్రతిభావంతుల సంక్షేమ శాఖ పర్యవేక్షకులు ప్రశాంతి, వార్డెన్ నాగస్వర్ణ, స్టాఫ్ నర్స్ సులోచన రాణి, సహాయకులు అవినాష్, సాయిబాబు, సుజిత, రాణి, విభిన్న ప్రతిభావంతులు బాలికల వసతి గృహం, మడోన్నా మూగ బదిరిల కళాశాల, మానసిక వికాస కేంద్రం, ప్రేమ వికాస్, ప్రేమ్ నికేతన్, విజయ మేరీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఫర్ బ్లైండ్ లకు చెందిన క్రీడాకారులు పలు క్రీడా పోటీలలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement