పవన్ కు సినిమాలు, షూటింగ్ లు లేవని… ప్రస్తుతం డైరెక్షన్ చంద్రబాబు, యాక్షన్ పవన్ కళ్యాణ్ అని ఏపీ మంత్రి జోగి రమేష్ అన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు 175 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగలరా అని ప్రశ్నించారు. రంగాను చంపిన టీడీపీకి ఓటేయమని పవన్ కళ్యాణ్ చెబుతారా అని అన్నారు.
ముద్రగడను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన టీడీపీకి ఓటు వేయమని పవన్ అడుగుతారా అని ప్రశ్నించారు. ముద్రగడ లేఖ పవన్ చదివితే చాప, దిండు సర్దుకోవాల్సిందేనన్నారు. ప్రతి చోట చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారన్నారు. బాధిత కుటుంబాన్ని ఓదర్చాల్సింది పోయి.. శవరాజకీయాలు చేస్తున్నారన్నారు. పరామర్శల పేరుతో చంద్రబాబు డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు.