తిరుమలలో సాధారణంగానే భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు ఎప్పుడు పోటేత్తుతూనే ఉంటారు. కానీ ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. భక్తుల సంఖ్య లేకపోవడంతో కంపార్ట్‌మెంట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. వసతి గదులు కూడా సులువుగా దొరుకుతున్నాయి. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ పెద్దగా ఉండదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం కేవలం గంట సమయంలోనే పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. హుండీ ఆదాయం… నిన్న తిరుమల శ్రీవారిని 65,051 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,107 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.78 కోట్ల రూపాయలు వచ్చింది. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉండకుండానే నేరుగా స్వామి వారి దర్శనం చేసుకుంటున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు ఎనిమిది గంటల సమయం పడుతుంది.