ప్రభుత్వ స్కూళ్లలోనూ డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని బాపట్ల జిల్లా యడ్లపల్లిలో సీఎం జగన్ 8వ తరగతి విద్యార్థులు, టీచర్లకు ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ విద్య అందకూడదనే పెత్తందారీ భావజాలం చూసి బాధవేసిందన్నారు. అందుకే అధికారంలోకి వచ్చాక అంతరాలను తొలగించే చర్యలు తీసుకున్నామన్నారు. చదువులో సమానత్వం ఉంటే ప్రతి కుటుంబం డెవలప్ మెంట్ అవుతుందన్నారు. పేదల తలరాత మారాలంటే చదువనే ఆస్తి ఉండాలన్నారు. ప్రతి విద్యార్థి భాగా చదువుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ప్రభుత్వ స్కూళ్లలోనూ డిజిటల్ విప్లవానికి శ్రీకారం.. సీఎం జగన్
Advertisement
తాజా వార్తలు
Advertisement