ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఏపీ శాప్) లో వివాదాలకు కేంద్రంగా మారుతోంది. శాప్లోని బోర్డు డైరెక్టర్లు, ఎండీ మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. శాప్ ఎండీ ప్రభాకర్ రెడ్డి వైఖరితో క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బోర్డు సభ్యులను సైతం ఎండీ పట్టించుకోవడం లేదని శాప్ డైరెక్టర్లు ఆరోపిస్తున్నారు. టెండర్లలోనూ అవినీతికి పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారని తెలుస్తోంది. ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వాపోయారు. ఈ క్రమంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి తీరును నలుగురు డైరెక్టర్లు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.
Advertisement
తాజా వార్తలు
Advertisement