Saturday, November 23, 2024

ప‌చ్చ‌ని వేప‌కు పాడురోగం.. ట్రీట్‌మెంట్ కావాలా? ఈ నెంబ‌ర్‌కు 040-21111111 కాల్ చేయండి..

ఈ మ‌ధ్య కాలంలో వేప చెట్ల‌కు వింత‌రోగం త‌గులుకుంది. ఉన్న‌ట్టుండి ప‌చ్చ‌ని చెట్లు ఎండిపోతున్నాయి. ముందుగా ఆకులు ఎండిపోయి రాలిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంతోపాటే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని చాలా ఏరియాల్లో ఇట్లాంటి ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. అయితే గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో అట్లాంటి ప‌రిస్థితులు ఉత్ప‌న్నం కాకుండా జీహెచ్ఎంసీ యాక్ష‌న్ ప్లాన్ చేపట్టింది.

వేప చెట్ల‌కు వ‌స్తున్న కొత్త డిసీజ్‌ని “Die Back” గా వృక్ష‌శాస్త్ర ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.ఈ డైబ్యాక్ బాక్టీరియాతో ఎపికల్ అండ్ మెయిన్ స్ట్రీమ్ పై ప్రభావం చూపుతుంది కాబట్టి పరిస్థితి తీవ్రంగా ఉందని చెబుతున్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న వేప చెట్లపై కొంతమంది వృక్ష‌శాస్త్ర నిపుణులు స్ట‌డీ చేశారు. అయితే.. తాము ఊహించినట్టుగానే 141 bp DNAలో తేడా ఉంద‌ని త‌మ అధ్య‌య‌నంలో తేలింద‌ని, దాని కార‌ణంగానే వేపపై డైబ్యాక్ వ్యాధి ప్ర‌బ‌లుతున్న‌ట్టు తెలుస్తోంద‌న్నారు.

అయితే.. ‘‘అన్ని జాతులు ఈ సమస్యతో బాధపడతున్నాయి.. ఆకురాల్చే చెట్లుగా వేప ఉంటుంది. ఇది పర్యావరణ సమస్యలను ప‌రిష్క‌రిస్తుందే కానీ. సూక్ష్మజీవుల వ్యాధుల నుండి విముక్తి పొందదు’’.. అని ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు చెబుతున్నారు.

‘‘వేప ఒక అద్భుత జాతిగా పరిగణించబడుతుంది. ఇది కాలుష్యం, అటవీ నిర్మూలన, నేల కోతతో పాటు పెరుగుతున్న ఉష్ణోగ్రతల వంటి ప్రధాన సమస్యలను త‌గ్గిస్తుంది.. అందుకే వేప‌చెట్ల‌ను కాపాడుకోవాలి’’ అని పిలుపునిస్తున్నారు ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement