Thursday, January 16, 2025

AP | జగన్మాతను దర్శించుకున్న డీజీపీ..

  • ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఈవో రామచంద్ర మోహన్..
  • అమ్మవారికి ప్రత్యేక పూజలు…
  • ఆలయంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు కు ప్రశంసలు

(విజయవాడ, ఆంధ్రప్రభ) : నగరంలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొలువైయున్న జగన్మాతను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ద్వారకా తిరుమల రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన డీజీపీకి… ఆలయ మర్యాదలతో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి, అదనపు కమిషనర్ రామచంద్ర మోహన్ ఘనంగా స్వాగతం పలికారు.

అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం డిజిపి కుటుంబ సభ్యులకు వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. శేష వస్త్రం, అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను ఈఓ రామచంద్ర మోహన్ అందజేశారు. అలాగే డీజీపీ సంక్రాంతి సందర్బంగా దేవస్థానం ఏర్పాటు చేసియున్న బొమ్మల కొలువు, తదితర కళాకృతులను తిలకించి, ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు అధికారులను ప్రశంసించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement