Friday, October 18, 2024

DGP – క‌ల్తీ నెయ్యిపై కేంద్ర ద‌ర్యాప్తు – ఎపి నుంచి సిట్ లో సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గోపీనాథ్‌ జెట్టి

ఎపి నుంచి సిట్ లో సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గోపీనాథ్‌ జెట్టి
పేర్ల‌ను ప్ర‌తిపాదించిన ఎపి డిజిపి
ఈ ద‌ర్యాప్తులో ఎపి పోలీస్ ల జోక్యం ఉండ‌ద‌న్న తిరుమ‌ల‌రావు

విజ‌య‌వాడ – తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంలో కేంద్రం చేపట్టే స్వతంత్ర విచారణలో రాష్ట్ర పోలీసుల జోక్యం ఉండదని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. కల్తీ నెయ్యి కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను సుప్రీంకోర్టు అనుమానించలేదని చెప్పారు విజ‌య‌వాడ‌లో ఆయ‌న నేడు మీడియాతో మాట్లాడుతూ, . ఈ వ్యవహారంలో స్వతంత్ర దర్యాప్తు జరగాలన్న ఉద్దేశంతోనే ప్రత్యేక బృందం ఏర్పాటు చేసిందని వెల్లడించారు. సిట్‌ సభ్యులుగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి, డీఐపీ గోపీనాథ్‌ జెట్టి పేర్లను పంపామని తెలిపారు. మొత్తం అయిదుగురు స‌భ్యుల‌తో ఉండే కేంద్ర ద‌ర్యాప్తు సిట్ లో ఇద్ద‌రు కేంద్రం నుంచి, మ‌రో ఇద్ద‌రు ఎపి నుంచి స‌భ్యులు కాగా, మ‌రొక‌రు ఫుడ్ స్టేఫ్టీ అథార్టీ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తార‌ని చెప్పారు.

టిడిపి కేంద్ర కార్యాలయం, గన్నవరం పార్టీ ఆఫీస్‌పై దాడి కేసులతో పాటు మరో రెండు కేసులను సీఐడీకి బదిలీ చేసినట్లు డీజీపీ తెలిపారు. వైసిపి నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై లుకౌట్‌ నోటీసు ఉందన్నారు. ఓ కేసులో గుంటూరు జిల్లా ఎస్పీ దీన్ని జారీ చేశారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement