ఆర్టీసీ ఎండీగా డీజీపీ ద్వారకా తిరుమలరావు అదనపు బాధ్యతలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్ ఐపీఎస్‌ల సీనియారిటీ జాబితాలో అందరికంటే ముందున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సెక్రటరీగా హరి జవహర్ లాల్ నియామకం అయ్యారు. దేవదాయ శాఖ స్పెషల్ సీఎస్‌గా సత్యనారాయణ నియామకమయ్యారు. దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు స్పెషల్ సీఎస్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.