తిరుమల వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవము బుధవారం ఘనంగా నిర్వహంచారు. నేటి మధ్యాహ్నం 1 గంటకు మలయప్పస్వామివారు తిరుచ్చిలో వేంచేసారు. వారి వెంట మరో తిరుచ్చిపై కృష్ణస్వామి వేంచేసారు. అనంతరం పార్వేట మండపము నందు పుణ్యాహము, ఆరాధన, నివేదనము జరిగి హారతులు జరిగాయి. అనంతరం ఉభయదారులైన తాళ్ళపాక వారికి, మఠంవారికి మర్యాదలు జరిగాయి.
కృష్టస్వామివారిని సన్నిధి యాదవ పూజ చేసిన చోటుకు వేంచేపుచేసి పాలు, వెన్న, హారతులు సమర్పించారు. అంతకు ముందు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు స్వామివారి సంకీర్తనలు ఆలంపించారు. తరువాత మలయప్ప స్వామివారి తరపున కొందరు అర్చకులు ముందునకు కొంత దూరము పరుగెత్తి మూడుసార్లు ఈటెను విసరడం జరిగింది. ఎంతో వేడుకగా జరిగే పార్వేట ఉత్సవము ఘనంగా ముగిసింది.
ఈ ఉత్సవంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీఓ లోకనాథం, ముఖ్య అర్చకులు కిరణ్ స్వామి, పేష్కార్ రామకృష్ణ, పారుపత్తేదారు బాలసుబ్రమణ్యం ఇతర ఉన్నతాధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.