Sunday, November 24, 2024

Devotional – దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో కృష్ణాష్టమి వేడుకలు

హైదరాబాద్ – దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ప్రారంభం అయ్యాయి. దేశంలోని ఇస్కాన్‌ మందిరాల్లో రాధాకృష్ణులకు ప్రత్యేక అలంకరణలు చేశారు. నేటి తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకుని కన్నయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

ఉత్తర్ ప్రదేశ్లోని మథుర దేవాలయంలో రాధాకృష్ణులకు ఆలయ అర్చకులు తెల్లవారుజామునే పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. ఈ హారతికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. కృష్ణా ముకుందా మురారి అని పాటలు పాడుతూ భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.

మరోవైపు దిల్లీలోని బిర్లా ఆలయంలో రాధాకృష్ణులకు ప్రత్యేక పూజలు చేశారు. మహారాష్ట్రలోని చౌపాటి ఇస్కాన్‌ ఆలయంలో రాధాకృష్ణుల అలంకరణ చాలా అందంగా ఉంది.

- Advertisement -

ఒడిశాలోని పూరీ బీచ్‌లో ఇసుకతో కృష్ణుడి రూపాన్ని రూపొందించారు. ఈ రూపం చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

మరోవైపు పలు . రాష్ట్రలలోని ఇస్కాన్ ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే పూజలు మొదలు పెట్టారు. రాధాకృష్ణులను అందంగా ముస్తాబు చేశారు. తెల్లవారు జామునుంచే కన్నయ్య భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గోకుల కృష్ణా గోపాల కృష్ణా అని పాటలు పాడుతూ కన్నయ్య అనుగ్రహం పొందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement