Sunday, September 15, 2024

Devotional – ఇంద్రకీలాద్రిపై శ్రావణ శోభ..

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో)ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి సరికొత్త శ్రావణ శోభ సంతరించుకుంది. అమ్మవారికి అత్యంత ఇష్టమైన శ్రావణమాసంలో కనకదుర్గమ్మ ను భక్తిశ్రద్ధలతో కొలిచేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రి కి తరలివస్తున్నారు.

శ్రావణమాసం అందులోను శుక్రవారం అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహిస్తే ఫలప్రదం అవుతుందని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలోనే మూడో శుక్రవారం అమ్మవారి దర్శనం తో పాటు వరలక్ష్మి దేవి వ్రతాన్ని ఆచరించేందుకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలోని మహా మండపం ఆరో అంతస్తులో అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక అలంకరణ చేసి సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని వేద పండితులు, వైదిక కమిటీ సభ్యులు శాస్త్రక్తంగా నిర్వహిస్తున్నారు.

వీటితోపాటు అమ్మవారి ఆర్జిత సేవలైన చండీ హోమం, ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన వంటి పూజలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అమ్మవారి దర్శనానికి వేలాదిగా తరలివస్తున్న భక్తుల రాకను ముందుగా అంచనా వేసిన ఆలయ అధికారులు అందుకు అనుకూలంగా కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు.

- Advertisement -

మూడో శ్రావణ శుక్రవారం అమ్మవారి ఆర్జిత సేవ అయిన ఖడ్గమాలార్చన లో రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి పాల్గొన్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పరికి అమ్మవారి దర్శనానంతరం, వైదిక కమిటీ సభ్యుడు శంకర శాండిల్య చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement