(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో)పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసం పూర్తి అయిన నేపథ్యంలో పోలి పాడ్యమి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. పోలి పాధ్యామి ని పురస్కరించుకొని కృష్ణ తీరాన భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరించడంతోపాటు భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలను నదిలో విడిచి పెడుతున్నారు. అలాగే దేదీప్యమైన విద్యుత్, దీపపు కాంతుల నడుమ దైవ క్షేత్రాలు తేజుయమంతంగా వెలుగొందుతున్నాయి.
పరమశివుని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున శివాలయాలకు తల్లి రావడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న దైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దీపాల వెలుగుల్లో కృష్ణమ్మ… కార్తీక మాసం ముగింపుకు మార్గశిర శుద్ధ పాడ్యమిగా పిలుస్తుంటారు. దీనిలో భాగంగా పోలిని స్వర్గానికి పంపడం ఆనవాయితీగా వస్తుంది. భక్తులు నది స్నానం ఆచరించిన తర్వాత ఆవు నేతితో ముంచిన వత్తులను అరటి డబ్బులలో పెట్టి వెలిగించి నదిలో వదిలివేయడం ఈ పూజల్లో భాగంగా ఉంటుంది.
పోలి పాడ్యమి సందర్భంగా సోమవారం తెల్లవారుజాము నుండే భక్తులు పెద్ద ఎత్తున కృష్ణమ్మకు దీపాలతో ప్రత్యేక పూజలు చేస్తుండడంతో దీపపు కాంతుల నడుమ కృష్ణమ్మ కళకళలాడుతోంది. కార్తీక మాసం ముగింపు సందర్భంగా పోలీ వర్గ వేడుకలలో భాగంగా భక్తులు పెద్ద ఎత్తున కృష్ణానది పర్యవాహక ప్రాంతాలలో అరటి డప్పులతో దీపాలను నదిలో విడిచి పెడుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాలతో పాటు నగరంలో ఉన్న ప్రముఖ శివాలయాల్లో ప్రాత కాలం నుండే ప్రత్యేక అభిషేకాలు, బిల్వార్చనలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. అలాగే ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొలువైయున్న అమ్మవారిని స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున కొండపైకి తరలివస్తున్నారు.