Saturday, January 18, 2025

Devotional – శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి సేవ‌లో ఎపి హైకోర్టు న్యాయ‌మూర్తులు ..

సింహ‌చ‌లం – శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కిరణ్మయి, జస్టిస్ సుమతి జగడం, జస్టిస్ బి ఎస్ భానుమతి లు స్వామి వారి ని దర్శించుకున్నారు. ముందుగా ఆల‌యానికి చేరుకున్న న్యాయ‌మూర్తుల‌కు వారికి ఆలయ కార్యనిర్వహణ అధికారి వి త్రినాథ రావు ఆల‌య మ‌ర్యాదల‌తో స్వాగ‌తం ప‌లికారు.. అనంత‌రం న్యాయ‌మూర్తులు శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకొని బేడమండపం ప్రదక్షణం చేశారు.అంతరాలయం లో పూజల్లో పాల్గొన్నారు.పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి కార్యనిర్వహణ అధికారి త్రినాథ రావు ,సహాయ కార్యనిర్వహణ అధికారి ఆనందకుమార్ గారు ,సూపరింటెండెంట్ జివిఎస్కే ప్రసాద్ స్వామివారి శేష వస్త్రం ,జ్ఞాపిక, ప్రసాదం అందజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement