40లక్షల అరవణ డబ్బాలు సిద్దం
నిత్య ఉత్పత్తి లక్ష్యం 1.25 లక్షల అప్పామ్ లు
టీడీబీ అధ్యక్షుడు ప్రశాంత్ వెల్లడి
ఆంధ్రప్రభ స్మార్ట్, తిరువనంతపురం : తులమాస పూజతో శబరిమల ఆలయం తెరుచుకుంది. ఈ నెల 30న ప్రారంభమయ్యే చితిర అట్ట విశిష్ట పూజ 31న ముగుస్తుంది. ఇక కార్తీక మాసం అడుగులు పెడుతున్న వేళ… మండల. మకర వైలక్కు సీజన్లు ఆరంభం నేపథ్యంలో ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) కీలక నిర్ణయాలు తీసుకుంది. మండల కళా ప్రారంభోత్సవానికి 40 లక్షల అరవణ డబ్బాలను సిద్ధంగా ఉంచాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుందని టీడీబీ అధ్యక్షులు పీఎస్ ప్రశాంత్ తెలిపారు. “అక్టోబర్ 18 నుంచి ప్రారంభమైన అరవణ ఉత్పత్తికి అవసరైన పదార్థాలను తాము నిల్వ చేసినట్టు ఆయన వివరించారు. రోజుకు 1.25 లక్షల వరకు అప్పామ్‌లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని బోర్డు కలిగి ఉంది. ఇది రోజువారీ డిమాండ్ 1.10 లక్షలను సులభంగా తీరుస్తుంది. గత తీర్థయాత్ర సీజన్‌లో, అరవణ అమ్మకాలతో ₹146.99 కోట్ల ఆదాయం చేకూరింది.