Friday, October 4, 2024

Devotion – తిరుమ‌ల‌లో బ్ర‌హ్మోత్స‌వ సంబురం – నేటి రాత్రికి ద్వ‌జారోహ‌ణం

నేటి నుంచి ఉత్స‌వాలు ప్రారంభం
స్వామివారికి సీఎం హోదాలో చంద్ర‌బాబు ప‌ట్టు వ‌స్త్రాలు
తొమ్మిది రోజుల పాటు దేవ‌దేవుడికి వాహ‌న సేవ‌లు
ఉద‌యం, సాయంత్రం మాడ‌వీధుల్లో భూదేవి, శ్రీదేవితో శ్రీ‌వారి విహారం
క‌నులారా వీక్షించేందుకు తిరుమ‌ల‌కు చేరుకుంటున్న భ‌క్త జ‌నం
గోవింద నామ స్మ‌ర‌ణ‌తో మారుమోగుతున్న స‌ప్త‌గిరులు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, తిరుమ‌ల :
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. శుక్ర‌వారం నుంచి 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనన్నాయి. బ్రహ్మోత్సవాల వేళ రోజు ఉదయం, సాయంత్రం వాహన సేవ జరగనుంది. సీఎం చంద్రబాబు దంపతులు ఈ రోజు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

- Advertisement -

నేడు ధ్వజారోహణ

శుక్ర‌వారం సాయంత్రం మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేస్తారు. కార్యక్రమం ద్వారా సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఆ తరువాత రాత్రి పెద్దశేషవాహన సేవ జరుగుతుంది. మొదటిరోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై (పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహిస్తారు.

వాహన సేవలు
బ్రహ్మోత్సవాల్లో ఉదయం వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహనసేవ సాయంత్రం 6.30 నుండి రాత్రి 11 గంటల వరకు జరుగుతుంది. ఆలయ నాలుగు మాడ వీధులలో భక్తులను ఆకట్టుకునేలా రంగవల్లులు తీర్చిదిద్దారు. గ్యాలరీలలో వేచివుండే భక్తుల సౌకర్యార్థం తాగునీరు, పాలు అందుబాటులో ఉంచారు.

ధ్వ‌జ‌రోహణ‌కు ముందే అప‌శృతి..
తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు అపశృతి చోటు చేసుకుంది. ధ్వజస్తంభం ఇనుప కొక్కెం ఇరిగిపోయింది. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా నేటి సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ధ్వజస్తంభం కొక్కెం ద్వారానే గరుడ పఠాన్ని ఎగురవేస్తారు అర్చకులు. అయితే, ఈ కొక్కి ఇప్పుడు విరిగిపోవడంతో టీటీడీ అధికారులు అలర్ట్ అయ్యారు. అర్చకుల సహాయంతో మరమ్మతులు చేపట్టారు టీటీడీ అధికారులు ..

Advertisement

తాజా వార్తలు

Advertisement