Tuesday, November 26, 2024

కార్తీక సోమవారం : శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

కార్తీకమాసం తొలి సోమవారం కావడంతో శైవ క్షేత్రాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. శివ నామస్మరణతో ఆలయాలు మారు మోగుతున్నాయి. భక్తులు శివునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. కృష్ణానది వద్ద శివ భక్తులు స్నానాలు ఆచరిస్తున్నారు. ఓం నమ:శివాయ అంటూ శివాలయాలలో శివునికి ప్రత్యేక అభిషేకాలు, రుద్రాభిషేకం, మహా రుద్రాభిషేకం, బిల్వార్చనలు, లక్ష బిల్వార్చన, సహస్ర లింగార్చన, రుద్ర హోమము, ఉంజల సేవ పూజలు నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం నెలరోజులపాటు పూజా కార్యక్రమాలు చేయనున్నారు.

మరోవైపు సోమవారం నాగుల చవితిని కూడా భక్తి శ్రద్ధలతో భక్తులు జరుపుకుంటున్నారు. దీంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement