Friday, January 24, 2025

KNL | శిఖరేశ్వరం వద్ద భక్తుల నిరసన..

కర్నూలు ( శ్రీశైలం) : శ్రీశైలం.. శిఖరేశ్వరం వద్ద మంగళవారం భక్తులు నిరసనకు దిగారు. నల్లమల్ల అడవుల్లోని ఇష్టకామేశ్వరి ఆలయాన్ని సందర్శించకుండా వాహనాలు నిలిపివేయడంపై భక్తులు మండిపడ్డారు. రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఫిట్‌నెస్‌ లేని జీపులను పోలీసులు నిలిపివేస్తూ ఆంక్షలు విధించారు.

దీంతో టికెట్లు తీసుకున్న తర్వాత భక్తులను ఇష్టకామేశ్వరి ఆలయానికి అనుమతించకుండా ఆంక్షలు విధించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నిరసన చేపట్టారు. భక్తులు శిఖరేశ్వరం వద్ద ఉన్న ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో శ్రీశైలం – దోర్నాల వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, కార్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement