Thursday, November 21, 2024

సింహ‌ద్రి అప్ప‌న్న‌కు భ‌క్తుడి పంగ‌నామాలు… ఖాతాలో డ‌బ్బులు లేకపోయినా రూ.100 కోట్ల‌కు చెక్

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యురో : సింహాచలం శ్రీ వరా హాలక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన హుండీలో బొడ్డేపల్లి రాధాకృష్ణ అనే భక్తుడు ఏకంగా వంద కోట్ల రూపాయల చెక్కును సమర్పించారు. ఆలయ ఇవో వి.త్రినాధరావు ఆద్వర్యంలో అధికారులు, సిబ్బంది హుండీలు తెరిచి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కిం చారు. అయితే ఈ లెక్కింపులో భాగంగా ఎంవీపీ డబుల్‌ రోడ్‌ , వెంకోజీపాలెం కొటక్‌ బ్యాంక్‌కు చెందిన వందకోట్లు చెక్‌ను అధికారులు గుర్తించారు. అయితే చెక్‌పై తేదీ లేకపోగా ఒకటి రెండు చోట్ల దిద్దుబాట్లు ఉన్నాయి. దీంతో అసలు ఇది నిజమా కాదా అన్నది బ్యాంక్‌కు పరిశీలన నిమిత్తం పంపిస్తామని ఆలయ ఇవో వి.త్రినాధరావు చెప్పారు. అయితే అకౌంట్‌ నంబర్‌ 8313295434 పేరిట వివరాలు మాత్రం స్పష్టంగానే ఉన్నాయి. అయితే చెక్ దారుడు రాధాకృష్ణ‌ ఖాతాలో కేవ‌లం 17 రూపాయిలే ఉండ‌టం విశేషం…

హుండీ ఆదాయం రూ.1.79 కోట్లు
సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం లభిస్తుంది. ఈ మేరకు ఆలయ అధికారులు హుండీలు తెరిచి లెక్కించారు. ఇందులో 16 రోజులకు సం బంధించి నగదు రూపంలో రూ.1,79,27,020 లభించగా బంగారం, వెండి కానుకలు కూడా పెద్ద మొత్తంలో భక్తులు స మర్పించారు. ఆలయ ఇవో విత్రినాధరావు ఆధ్వర్యంలో జరిగిన లెక్కింపు కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement