Friday, November 22, 2024

రైతుల కష్టాలు కనబడుతున్నాయా?

ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మరోసారి ట్విట్టర్ వేదికగా తవ్ర విమర్శలు చేశారు. రైతుల కష్టాలు కనబడుతున్నాయా అంటూ ధ్వజమెత్తారు. నిన్న కురిసిన వర్షాలకు మునగ పంట దెబ్బతిన్నదని, చెట్లు వేళ్లతో సహా కూలిపోవడంతో మునగరైతులు లబోదిబోమంటున్నారని తెలిపారు. మునక్కాయలు కేజీ రూ.200 ఉండాల్సిన ధర రూ.10కు అడుగుతున్నారని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారన్నారు. ఒక్కపైసా కూడా చేతికి రాకుండానే పంట దెబ్బతిందంటున్న మునగ రైతుల కష్టాలు సీఎం జగన్‌కు కనబడుతున్నాయా? అంటూ దేవినేని ఉమ ప్రశ్నించారు.

ఇక రాష్ట్రాన్ని బ్లాక్ ఫంగస్ భారీఎత్తున కలవరపెడుతోందని దేవినేని ఉమా అన్నారు. గుజరాత్, మహారాష్ట్ర తర్వాత ఏపీ దేశంలో 3వ స్థానంలో ఉందన్నారు. ఇంజక్షన్లు లేక నామమాత్ర చికిత్స చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 910 కేసులు ఉన్నాయన్నారు. ఫంగస్ పై జగన్ సర్కార్ దృష్టిపెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలు అరచేతిలోపెట్టుకుని ప్రభుత్వం వైపు చూస్తున్న బాధితుల బాధలు కనబడుతున్నాయా? అంటూ దేవినేని ఉమా నిలదీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement