ఏపీలో దిశ యాప్ పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం దిశ యాప్ తీసుకొచ్చి..ఆడబిడ్డలకు అండగా నిలుస్తామని చెప్పిన సంగది తెలిసిందే. అయితే టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దిశ యాప్ పేరుతో మళ్లీ మళ్లీ బటన్‌లు నొక్కారని, స్టేషన్‌లు, ఛార్జిషీట్లు, శిక్షలు అంటూ అసత్య ప్రచారం చేశారని విమర్శించారు. దిశ చట్టంతో మహిళలపై జరిగిన ఘటనల్లో 21 రోజుల్లో ఎంతమందికి శిక్ష వేశారని ప్రశ్నించారు. ఓ దిశ నీవెక్కడ..? అంటున్న మహిళలకు సమాధానం చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా? అని దేవినేని ఉమ ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: జంట నగరాలుగా విశాఖ-విజయనగరం: విజయసాయిరెడ్డి