విజయవాడ – టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ హత్యయత్నం నుంచి తృటిలో తప్పించుకున్నారు.. కొండపల్లిలో తన కారుపై బండరాయితో దాడి చేశారని ఆయన ఈరోజు విజయవాడలో వెల్లడించారు.. కారు డోరు తీసి ఉంటే తనతో పాటు మరికొందరు చనిపోయేవారని చెప్పారు. దైవ కృపతో తామందరం ప్రాణాలతో బయటపడ్డామని అన్నారు..
కాగా, తనను చంపేందుకు ఎన్నో కుట్రలు చేస్తున్నారని తెలిపారు. ఏప్పుడైనా తనను చంపేయొచ్చని చెప్పారు. దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. తెలుగుదేశం పార్టీ శ్రేణులు దేవినేని భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆయనకు ప్రత్యేక భద్రత కల్పించాలని పోలీస్ శాఖను కోరారు.