పొందూరు, (ప్రభ న్యూస్) : మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్యాలయాల రూపురేఖలను మార్చేస్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. పొందూరు మండలం బొడ్డేపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు స్పీకర్ చేతుల మీదగా ప్రారంభోత్సవాలు చేశారు. మనబడి నాడు-నేడు కార్యక్రమం ద్వారా 11.30 లక్షల రూపాయల నిధులతో పనులు పూర్తి చేసిన పాఠశాలను ప్రారంభించారు. అదేవిధంగా సుమారు 21 లక్షల నిధులతో పనులు పూర్తి చేసిన సిసి రోడ్లను కూడా ప్రారంభించారు.
ఆ గ్రామంలో ఒక మహిళ గృహ నిర్మాణ బిల్లు రాలేదని స్పీకర్ కు ఫిర్యాదు చేయగా వారి పేరును ఆన్ లైన్ లో నమోదు చేసి వారికి బిల్లు అందే విధంగా చూడాలని హౌసింగ్ ఏఈ మోహన్ ను ఆదేశించారు. ఇటు-వంటి సమస్యలు గ్రామాల్లో పునరావృతం కాకుండా చూడాలని హౌసింగ్ ఏఈకి సూచించారు. త్వరలో వైఎస్ఆర్ గ్రామదర్శిని కార్యక్రమం ద్వారా అధికారులతో ప్రతి గ్రామం సందర్శిస్తానని, ప్రజల సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నామని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కిల్లి ఉషారాణి, జెడ్ పి టి సి లోలుగు కాంతారావు, వైస్ ఎంపీపీ ప్రతినిధి వండన వెంకట్రావు, మార్కెట్ కమిటీ- చైర్మన్ బడాన సునీల్, పొందూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ రెగిడి లక్ష్మి, స్థానిక సర్పంచ్ బొడ్డేపల్లి శ్రీవల్లి మరియు సర్పంచులు, ఎంపీటీ-సీలు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily