Friday, November 22, 2024

AP: త‌మ ప్రతి అడుగులోనూ అభివృద్ధే – జ‌గ‌న్

విజ‌య‌వాడ‌: ప్రతి అడుగులోనూ అభివృద్ధి అంటే ఇదీ అంటూ ప్రతి ఇంటికీ మంచి చేస్తూ అడుగులు వేయిస్తున్నామని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ అన్నారు. గతానికి ఇప్పటికీ తేడా గమనించమని కోరారు. విజ‌య‌వాడ కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్‌ రిటైనింగ్‌ వాల్, రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌కు నేడు సీఎం ప్రారంభోత్సవం చేశారు. అలాగే విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలో పేదలకు ఇచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు కల్పించి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, రూ.12.3 కోట్లతో రివర్‌ ఫ్రంట్‌ పార్క్‌ అభివృద్ధి చేశామ‌ని చెప్పారు.. విజయవాడలో ఇప్పటికే రూ.400 కోట్లతో అంబేద్కర్‌ పార్క్‌ను ప్రారంభించామని ఆయన తెలిపారు.

అభివృద్ధి మంత్రం మాది…

ఏపీకి ఏమీ చేయని ప్రతి పక్షాలు తామే అభివృద్ధి చేశామ‌ని చెప్పుకుంటున్నాయ‌ని మండిపడ్డారు. రెండు కరకట్ట గోడలు 5 వందల కోట్లతో కట్టామని, ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడు నాలుగు మాటలు చెప్పడమే కానీ…దానిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్నారు.అది కేవలం మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరిగిందని, రివర్ ఫ్రంట్ పార్క్ ఏర్పాటు చేసామన్నారు.

- Advertisement -

31వేల మందికి పైగా హ‌క్కు ప‌ట్టాలు

విజయవాడ లో వివిధ కాలనీల్లో 31 వేల 866 కు పైగా పట్టాలను క్రమమబద్ధీకరిస్తూ సంపూర్ణ హక్కులు ఆ కుటుంబాలకు ఈ రోజు ప‌ట్టాలు ఇచ్చామ‌న్నారు. 239 కోట్లతో సివరేజి ట్రీట్మెంట్ ప్లాంట్ ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేసామన్నారు. అభివృద్ధిని ప్రతి అడుగులో చూపిస్తున్నామని చెప్పారు. ఏమి చేయని విపక్షాల వారు అభివృద్ధి…అభివృద్ధి అంటారని ఆయన వ్యాఖ్యానించారు. వాలంటరీ వ్యవస్థ తో మంచి చేసే కార్యక్రమం కేవలం 58 నెలలుగా జరుగుతోందని అన్నారు, పార్క్ లకు కృష్ణమ్మ జలవిహార్ పేరు పెడుతున్నామని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement