అమరావతి, ఆంధ్రప్రభ: చేనేత కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని చేనేత, జౌళిశాఖ వైస్ చైర్మన్, ఎండీ సి.నాగరాణి స్పష్టం చేశారు. గురువారం కృష్ణాజిల్లాలో పర్యటించారు. చేనేత స హకార సంఘాల పనితీరును కార్మికుల జీవన పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉత్పత్తుల్ని రూపొందించాల్సిదిగా ఆమె సూచించారు. మల్లవోలు చేనేత క్లస్టర్ ద్వారా మొదటి విడత మంజూరైన నిధులతో హెచ్‌ఎస్‌ఎస్ కాంపోనెంట్ కింద 20జాకార్డ్ మిషన్లు, 22 డాబీలు, 42 మందికి మగ్గాలు, 33 మందికి ఫ్రేమ్‌లూమ్‌లో, 40 మోటరైజ్డ్ జాకార్డులు, 30 మందికి మోటరైజ్డ్ వైండింగ్ మిషన్లు, 30 మందికి వర్క్ షెడ్లు అందించారు. స్కిల్ అప్‌గ్రెడేషన్ కాంపోనెంట్ కింద 120 మందికి వీవింగ్ ట్రైనింగ్ ప్రొగ్రాంను సమీక్షించారు. ఈ క్లస్టర్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.68.619 నిధులు కేటాయించగా రూ.68.610 నిధులు ఖర్చు చేసినట్లు ఆమె వెల్లడించారు.
ఈక్టస్టర్‌కు రెండో విడత రూ.20.240 లక్షలు టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ కాంపోనెంట్ కింద అందజేయనున్నలు నాగరాణి పేర్కొన్నారు. శిక్షణ, పరికరాలు పొందిన లబ్ధిదారులతో ముఖాముఖీ సమావేశం నిర్వహించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో ఇంట్లోనే మగ్గం పెట్టుకోవాల్సి రావడంతో ఇబ్బందులు పడేవారమని, ఇప్పుడు షెడ్డు ఏర్పాటు చేసుకోవడంతో వెసులుబాటు కల్గిందని, అలాగే 90 శాతం సబ్సిడీపై అందించే పరికరాలతో నాణ్యమైన ఉత్పత్తుల్ని తయారు చేయగలుగుతున్నామని పలువురు లబ్ధిదారులు పేర్కొన్నారు. కప్పలదొడ్డి, పెడన ప్రాంతాల్లో పర్యటించి చేనేత కార్మికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సహాయ సంచాలకులు ఎం.నాగేశ్వరరావు, ప్రాంతీయ ఉప సంచాలకులు ధనుంజయరావు, రఘునందన రావు తదితరలు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..