అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత అదుపులోకి వచ్చింది. కొద్ది రోజులుగా స్వల్పస్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 17,735 కరోనా పరీక్షలు నిర్వహించగా 220 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. మరోవైపు కరోనా తీవ్రతతో చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు మరణాలు సంభవించాయి. జిల్లాల వారీగా నమోదైన కేసులను పరిశీలిస్తే అనంతపురంలో 9, చిత్తూరులో 11, తూర్పు గోదావరి జిల్లాలో 27, గుంటూరులో 36, కడప జిల్లాలో 6, కృష్ణాలో 40, కర్నూలులో 2, నెల్లూరులో 14, ప్రకాశంలో 8, శ్రీకాకుళం జిల్లాలో 2, విశాఖలో 20, విజయనగరంలో 2, పశ్చిమ గోదావరి జిల్లాలో 43 మందికి కొత్తగా పాజిటివ్‌గా నిర్థారణ అయింది.
ఇదే సమయంలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 472 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల 927 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 23 లక్షల 17 వేల 184గా నమోదైంది. అలాగే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 14 వేల 720 మంది కరోనా తీవ్రతతో మరణించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..