ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని ప్రకటించింది. ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు రాజమండ్రి స్టేషన్ సమీపంలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో ఒకే ట్రాక్‌పై రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోల్‌కతా-చెన్నై రహదారిలో రైళ్ల రాకపోకలు అంతరాయం ఏర్పడింది.
గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో దక్షిణమధ్య రైల్వే తొమ్మిది రైళ్లను రద్దు చేసింది. మరో రెండు రైళ్లను పాక్షికంగా రద్దుచేసింది. విజయవాడ-లింగంపల్లి రైలు రెండు గంటలు ఆలస్యంగా నడుస్తాయని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ట్రాక్‌పై హుటాహుటిన మరమ్మతులు చేస్తున్నారు.