కర్నూలు జిల్లా నంద్యాల సబ్ కలెక్టర్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న సురేంద్ర(33) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. బనగానపల్లె పట్టణంలోని రాంభూపాల్‌రెడ్డి నగర్‌లో తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. గతంలో నియోజకవర్గంలోని సంజామల మండలంలో డిప్యూటీ- తాసిల్దార్‌గా విధులు నిర్వహించారు. సోమవారం సాయంత్రం విధుల నుంచి ఇంటికి వచ్చిన ఆయన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న దాంపత్య జీవితంలో భగ్గున సురేంద్ర మృతితో ఆ కుటుంబం తీరని విషాదంలో మునిగిపోయింది.
కాగా, తన మరణానికి ఎవరూ కారణం కాదని, తన కుటుంబ సభ్యులను ఎవరూ ఇబ్బంది పెట్టవద్దని సూసైడ్ నోట్లో కూడా రాసినట్లు సమాచారం. మృతి చెందిన సురేంద్రకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని భార్య నియోజకవర్గంలోని కోవెలకుంట్ల ఎక్సైజ్ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. స్థానిక తహసీల్దార్ ఆల్ఫెడ్ర్, బనగానపల్లె ఎస్‌ఐ జి.కృష్ణమూర్తి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సమాచారం తెలుసుకున్న నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ హుటా హుటిన బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని డాక్టర్‌లతో కలిసి మృతదేశాన్ని పరిశీలించిన ఘటనపై ఆరా తీశారు. అంతకు ముందు సురేంద్ర భార్యతో నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడి మనోధైర్యం కల్పించారు.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily