ఏపీ వరదలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఏలేరు రిజర్వాయర్‌కు నీటి ప్రవాహం పెరుగుతుండటం, వర్షాల కారణంగా వరద ముప్పు పొంచి ఉన్నందున ముంపునకు గురైన గ్రామాల పరిస్థితిని అధికారులతో కాకినాడ జిల్లా కలెక్టర్ పవన్ కళ్యాణ్ సమీక్షించారు.
24 టీఎంసీల సామర్థ్యం గల ఏలేరు రిజర్వాయర్ లో వరద నీరు 21 టీఎంసీలకు చేరుకోవడంతో నీటిపారుదల, రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య, విద్యుత్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా ఉప్పాడ ప్రాంత ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
కాకినాడ జిల్లా కలెక్టర్ పరిస్థితిని వివరిస్తూ…. ఏలేరు రిజర్వాయర్ కి ఇన్‌ఫ్లో ఉదయం 4 వేలు క్యూసెక్కులు ఉంటే సాయంత్రానికి 8 వేలు క్యూసెక్కులు ఉందన్నారు. రాత్రికి 10 వేల క్యూసెక్కులకు చేరుతుందని అంచనా వేశామని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలోని జగనన్న కాలనీ, సూరంపేట కాలనీ, కోలంక, మాదాపురం, నవఖండవాడ ప్రాంతాలపై వరద ప్రభావం ఉంటుందని, యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
కాగా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు (సోమవారం) కాకినాడ వెళ్లనున్నారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించనున్నారు. వరద ముప్పు ఉన్నందున ఏలేరు నియోజకవర్గంలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షించనున్నారు.