అమరావతి – ఏజెన్సీ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగుతోంది.. నిన్న పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధికి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన.. ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు.. అనంతగిరి మండలం బల్లగరువు (పినకోట పంచాయతీ)లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగనుంది..
ఈ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు పవన్.. ఉదయం 10.30 గంటలకు బల్లగరువు ప్రాంతానికి చేరుకోనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
- Advertisement -