రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని గ్రామీణ రహదారుల అభివృద్ధికి ఏఐఐబీ రుణంలో సడలింపు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర రూరల్ రోడ్స్ ప్రాజెక్ట్ (APRRP) కోసం ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ & ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (AIIB) నుంచి తీసుకొన్న రుణానికి సంబంధించి ప్రాజెక్టును 31 డిసెంబర్ 2026 వరకు పొడిగింపు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే ఏపీ గ్రామీణ రహదారి ప్రాజెక్టులో మార్పులు చేయాలని విన్నవించారు. ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి ప్రస్తుత గడువు డిసెంబర్ 31, 2024 సరిపోదని.. డిసెంబర్ 2026 వరకు ప్రాజెక్ట్ పొడిగింపు ఇవ్వగలరు అని కొరారు.
నిధుల చెల్లింపుల విధానంలో మార్పులు చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రస్తుతం ఉన్న 70% (AIIB) : 30 %+ పన్నులు (AP ప్రభుత్వం) విధానం నుంచి 90% (AIIB) :10% (AP ప్రభుత్వం) మార్పు చేసి.. 455 మిలియన్ US డాలర్ల (అంటే రూ.3834.52 కోట్లు) బ్యాంక్ ఒప్పుకొన్న మేరకు వాటాను కొనసాగిస్తూ నిధుల విడుదలను మార్పును పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.