Friday, November 22, 2024

Deputy CM Pawan Kalyan – గ్రామీణ రహదారులకు మహర్దశ – రూ.4,976 కోట్లు నిధులతో రోడ్ల నిర్మాణం

రూ.4,976 కోట్లు నిధులతో 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక

250 మించి జనాభా కలిగిన ప్రతి గ్రామానికీ రహదారి అనుసంధానం

మ్యాచింగ్ గ్రాంటు 10 శాతానికి తగ్గించేలా కేంద్రంతో మాట్లాడుతాం

ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు అధికారులు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంతో సమీక్షలో ఉప ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్

- Advertisement -

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – అమరావతి ,,- ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలు తీసుకున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. వరుసగా ఆయా శాఖలపై సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు…

అమరావతి లోని సచివాలయంలో: ఈ రోజు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఏఐఐబీ ప్రతినిధులతో సమావేశమైన ఆయన.గ్రామీణ రహదారుల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు.. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు.. గ్రామాలకు రహదారుల అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తేనే ప్రగతి అన్నారు పవన్.. రూ.4,976 కోట్లు నిధులతో 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని.. 250 మించి జనాభా కలిగిన ప్రతి గ్రామానికీ రహదారి అనుసంధానం చేయాలని ఆదేశించారు

.

మ్యాచింగ్ గ్రాంటు 10 శాతానికి తగ్గించేలా కేంద్రంతో మాట్లాడుతాం అన్నారు పవన్‌ కల్యాణ్.. గ్రామాల్లో రహదారుల నిర్మాణం వల్ల పేదరిక నిర్మూలనతో పాటు సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు మెరుగవుతాయన్న ఆయన.. గ్రామీణ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు మరింత కోరదాం అన్నారు. గత ప్రభుత్వ హయాంలో బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణ ప్రక్రియ కుంటుబడిందని విమర్శించారు.

ఇక, పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ విభాగం పనుల్లో పారదర్శకతను ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో సమీక్షిస్తాం.. ప్రత్యేక పోర్టల్ అభివృద్ధి చేస్తాం. ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు వీలుగా ఆ పోర్టల్ లో ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన 30 శాతం మ్యాచింగ్ గ్రాంటును 10 శాతానికి తగ్గించే విధంగా అవసరమైన మార్పులు చేయాలని కేంద్రం ప్రభుత్వాన్ని కోరతామని ఈ సందర్భంగా వెల్లడించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

https://twitter.com/DeputyCMPK/status/1811399372355363149?t=vIc3cVYBw5r9_J-pUHQh3w&s=19

Advertisement

తాజా వార్తలు

Advertisement