Thursday, October 3, 2024

AP | స‌నాత‌న ద‌ర్మాన్ని హేళ‌న చేస్తే ఊరుకొము : డిప్యూటీ సీఎం పవన్

తిరుపతిలో నిర్వహించిన వారాహి సభలో జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దశాబ్దానికి పైగా తనను, తన కుటుంబాన్ని కొందరు అవమానించారని, నీచంగా మాట్లాడారని పవన్ కళ్యాణ్ అన్నారు. అయినప్పటికీ ఒక్క మాట మాట్లాడలేదని, అధికారం వచ్చినా… ప్రతీకార రాజకీయాలు చేయాలనుకోలేదని చెప్పారు. కానీ తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని అవహేళ చేస్తే చూస్తూ ఊరుకుంటామా అని అన్నారు.

ఇది సినిమాలకు, రాజకీయాలకు సమయం కాదని. సనాతన ధర్మాన్ని కాపాడుకుంటే, ఆ ధర్మమే అందర్నీ రక్షిస్తుందన్నారు. ఇవాళ నిర్వహిస్తున్న వారాహి సభ చాలా ప్రత్యేకమైనదని, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయింది. ప్రజలకు ఇచ్చిన హామీల అమలపై మా దృష్టి ఉంటుంది.

రాష్ట్రంలో నెగ్గిన కూటమి ప్రభుత్వం కేంద్రానికి బాసటగా నిలిచింది. ఎన్నికల్లో కూటమి గెలిస్తే ఎలాంటి పగ, ప్రతీకారాలకు తావు ఉండదని చెప్పాం, అది చేసి చూపిస్తున్నాం అన్నారు. సనాతన ధర్మం అన్ని ధర్మాలను, మతాలను గౌరవిస్తున్నారు. అదే విధంగా ఇస్లాం, క్రైస్తవం, సిక్కిజం, బౌద్ధ, ఇతర మతాల నుంచి మంచిని నేర్చుకుని పాటించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

గతంలో తాను కులం చూడలేదని, మతం చూడలేదని నష్టపోయిన రైతులు అందరికీ ఆర్థిక సాయం చేసి ఆదుకున్నట్లు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. హిందువులపై, హిందూ దేవుళ్లపై చేసినట్లు ఇతర మతాలపై, వారి దేవుళ్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేయాలంటే వణికిపోతుంటారు. ఎందుకంటే మనలో లేని ఐకమత్యం వారిలో ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు.

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామికి జరిగిన అవమానంపై ఓ భక్తుడిగా ప్రశ్నిస్తే అవహేళన చేస్తున్నారు. ప్రాయశ్చిత్త దీక్ష చేపడితే నవ్వారు. భిన్నత్వంలో ఏకత్వం చూపించేది సనాతన ధర్మం. కొందర్ని భగవంతుడు 11 సీట్లకు పరిమితం చేసినా బుద్ధి రాలేదు. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ నెయ్యి, జంతువు కొవ్వుతో కలిపి తయారు చేసి అపచారం చేస్తే మేము మాట్లడకూడదా అని నిలదీశారు.

- Advertisement -

జంతువు కొవ్వుతో తయారు చేసిన లడ్డూలు అయోధ్య రామాలయానికి పంపించి అపచారం చేశారు. అయోధ్య రామ జన్మభూమిలో శ్రీరాముని ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంటే దేశ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ “నాచ్ గాన” కార్యక్రమం అని అవమానిస్తారా? దీనిని ఏ హిందువూ ప్రశ్నించరా? అంటే వారు మన రాముడిపై జోకులు వేస్తే చూస్తూ కూర్చోవాలా? అని అన్నారు. అందుకే సనాతన ధర్మం పాటించేవారంతా ఏకం కావాలి అన్నారు.

ఈ సంద‌ర్భంగా వారాహి బహిరంగ సభలో కేంద్రానికి పలు సూచనలు చేస్తూ డిక్లరేషన్ ను విడుదల చేశారు. ఏ మతానికి, ధర్మానికి భంగం కలిగినా ఒకేలాగా స్పందించేలా బలమైన చట్టం తీసుకురావాలని కోరారు. సనాతన ధర్మ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని దానికి ప్రతి సంవత్సరం కేంద్రం నిధులు విడుదల చేయాలని సూచించారు. అన్ని ఆలయాల్లో ప్రసాదంలో వినియోగించే నాణ్యమైన వస్తువులు సరఫరా చేసి ధ్రువీకరించే విధానాన్ని తీసుకురావాలని పేర్కొన్నారు. ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాకుండా, విద్యా, కళా, ఆర్థిక, పర్యావరణ, కేంద్రాలుగా తయారు చేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement