రాష్ట్రంలోని అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం, అభివృద్దికై ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను పటిష్టంగా అమలు చేయాలని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. ఆయా వర్గాలకు పూర్తిస్థాయిలో లబ్దిచేకూర్చాలని అధికారులను ఆదేశించారు. అల్పసంఖ్యాక వర్గాల ప్రజలను సామాజికంగా, అర్థికంగా అభివృద్ది పర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమాన్నిరాష్ట్రంలో పటిష్టంగా అమలు పర్చే అంశంపై అధికారులు ప్రత్యేక శ్రద్దచూపాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోని వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతానికి గురయ్యాయని, వాటి పరిరక్షణకై అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. భూముల అన్యాక్రాంతానికి సంబంధించి కోర్టులో పెండింగ్ లోనున్న పలు కేసుల సత్వర పరిష్కానికి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రత్యేకించి పట్టణ ప్రాంతాల్లో అన్యాక్రాంతమైన వక్పు బోర్డు భూముల్లో శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు జరుగకుండా చూడాలన్నారు. వక్ఫ్ బోర్డు భూముల క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్లు జరుగకుండా ఉండేందుకై వక్ఫ్ బోర్డు భూముల వివరాలను ముందుగా రిజిస్ట్రేషన్ అధికారులకు అందజేసి వారిని అప్రమత్తం చేయాలన్నారు.
వక్ఫ్ బోర్డు భూములపై డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు
By mahesh kumar
- Tags
- andhra news
- andhra pradesh
- andhra pradesh news
- ap
- AP Deputy CM Amjad Basha
- AP Nesw
- AP NEWS
- ap news today
- important news
- Important News This Week
- Important News Today
- Latest Important News
- Most Important News
- telugu breaking news
- Telugu Daily News
- Telugu Important News
- telugu latest news
- telugu news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
- waqf board
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement