Saturday, November 23, 2024

అప్పన్న సన్నిధిలో- ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పూజలు

సింహాచలం.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు సోమవారం తన కుటుంబ సభ్యులతో కలిసి సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు.. ఆలయ రాజగోపురం వద్ద ఏఈఓ తిరుమలేశ్వర రావు , ట్రస్టు బోర్డు సభ్యులు గంట్ల శ్రీనుబాబు, దొడ్డి రమణ, శ్రీదేవి వర్మ ,ఎం రాజేశ్వరి, చందు, శేశారత్నం..తదితరులు సాదర స్వాగతం పలికి ఆలయము లోకి తోడ్కొని వెళ్లారు.. తొలుత కప్ప స్తంభం ఆలింగనం చేసుకుని అనంతరం ఆలయ బేడా మండపం చుట్టూ ప్రదక్షణనలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల సన్నిధిలో బూడి ముత్యాలనాయుడు పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు,, వేదమంత్రోచ్ఛారణల నడుమ మృదుమధుర మంగళవాయిద్యాల మధ్య అర్చక స్వాములు ఉప ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను సాదరంగా ఆశీర్వదించారు.. ఆలయ అధికారులు ట్రస్టు బోర్డు సభ్యులు జ్ఞాపిక ,ప్రసాదాలు మంత్రి కి అందజేశారు.. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు మాట్లాడుతూ ..గ్రామస్థాయి నుంచి తాను ఉపముఖ్యమంత్రి వరకు అంచెలంచెలుగా ఎదిగానన్నారు ప్రజా సమస్యల పట్ల తనకి పూర్తి స్థాయిలో అవగాహన ఉందన్నారు. తన సేవలను గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవి కేటాయించటం పట్ల ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు .పార్టీని నమ్ముకున్న వారికి ప్రత్యక్షంగా ఎదుగుదల ఉంటుందనడానికి తానే నిదర్శనమని చెప్పుకొచ్చారు.. ఈ సందర్భంగా చంద్ర బాబు, యనమల రామకృష్ణ డుపై మంత్రి విమర్శలు గుప్పించారు.
తాను యనమల మాదిరిగా దొడ్డిదారిన ఉప ముఖ్యమంత్రి కాలేదని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కథ పూర్తిగా ముగుస్తుందని చెప్పారు.

ఘనంగా సన్మానం..
ఈ సందర్భముగా సింహాచలం ఆలయ ట్రస్టీ, జాతీయ జర్నలిస్టుల సంఘము కార్యదర్శి గంట్ల శ్రీను బాబు ఆధ్వర్యములో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు ను ఘనముగ సత్కరించారు.. తాను ఎప్పుడూ అందరి వాడిగానే ఉంటానని, ఉప ముఖ్యమంత్రి ఐన మార్పు ఉండదని అందరినీ పేరు పేరున బూడిముత్యాల నాయుడు సాదరముగా పలకరించారు సింహాచలం లో భారీగా ఉప ముఖ్యమంత్రి కి స్వాగతం లభించింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement