గన్నవరంలో దట్టమైన పొగమంచు అలుముకుంది. ఈ ఉదయం నుంచి పొగమంచు దట్టంగా అలుముకోవడంతో గన్నవరం ఎయిర్‌పోర్టులో విమానాలకు అంతరాయం ఏర్పడింది. ల్యాండింగ్ ప్లాబ్లంతో విమానాలు గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి.
గన్నవరం విమానాశ్రయంలో పొగమంచు కారణంగా రన్ వే కనిపించకపోవడంతో విమానాల ల్యాండింగ్‌కు ఆలస్యం అవుతోంది. దీంతో విమానాశ్రయానికి రావాల్సిన పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్టు అధికారులు తెలిపారు. విజయవాడ-ఢిల్లీ విమానం, షార్జా నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం పది రౌండ్లు గాల్లోనే చక్కర్లు కొట్టింది. చివరకు ఏటీసీ అధికారులు ల్యాండింగ్‌కు అనుమతించకపోవడంతో విమానం హైదరాబాద్ వైపు మళ్లింది. గన్నవరం విమానాశ్రయంలో ఇటీవలి కాలంలో పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు తరచు అంతరాయం ఏర్పడుతోంది.