Saturday, November 23, 2024

Delhi | కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ..

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పూర్తిస్థాయి మొత్తం ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని చంద్రబాబు నాయుడు కోరినట్లు తెలుస్తోంది.

కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అంగీకరించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణానికి అవసరమైన 12 వేల కోట్ల రూపాయల ప్రతిపాదనలకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ అంగీకరించింది.

పోలవరం మొదటి దశ నిర్మాణానికి అవసరమయ్యే 12 వేల కోట్ల రూపాయల ఖర్చుతో పాటు మొత్తం 50 వేల కోట్ల రూపాయల ఖర్చుతో కూడిన ప్రతిపాదనలకు ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. కాగా, పోలవరం ప్రాజెక్టు మొదటి దశ మార్చి 2026 నాటికి పూర్తవుతుందని కేంద్ర మంత్రి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement